TG : వెదురు సాగు.. తొలుత 5వేల మంది రైతులకు అవకాశం

వెదురు సాగును ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే 4 ఏళ్లలో 7లక్షల ఎకరాల్లో సాగు చేయడం ద్వారా 75వేల మంది రైతులకు ఉపాధి కల్పించాలని భావిస్తోంది. భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమురం భీం జిల్లాల్లో వెదురు సాగు చేపట్టాలని నిర్ణయించింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి జిల్లాను ఎంపిక చేశారు. ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించనున్నట్లు సమాచారం.
వెదురు సాగుకు తొలుత 5వేల మంది రైతులను ప్రభుత్వం ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. నర్సరీల్లో మొక్కల్ని పెంచి రైతులకు పంపిణీ చేయనుంది. ఎకరంలో 60 మొక్కల్ని నాటుతారు. 30 ఏళ్ల వరకూ సాగు చేసుకోవచ్చు. ఎకరాకు ₹20వేల పెట్టుబడితో ఏడాదికి ₹40,000-₹60,000 ఆదాయం వచ్చే ఛాన్సుంది. వెదురు వస్తువులకు, వెదురు నుంచి తీసే ఇథనాల్‌కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో దీని సాగును ప్రోత్సహించాలని సర్కార్ నిర్ణయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com