TPCC Leade : బనకచర్ల పాపం కేసీఆర్ దే : టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్

TPCC Leade : బనకచర్ల పాపం కేసీఆర్ దే : టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్
X

బనకచర్ల పాపం ముమ్మాటి కీ కేసీఆర్ దేననిటీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే మన నీళ్ల వాటాను ఆంధ్రాకు తాకట్టు పె ట్టారని.. ఏ మొహం పెట్టుకొని హరీశ్ రావు మీడియా ముందు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్ కు కేసీఆర్ ఫ్యామి లీకి సంబంధమేంటి? అని ప్రశ్నించారు. రా జకీయాల్లో ఇచ్చిపుచ్చుకోవడం ఉండాలని.. అదే కాంగ్రెస్ పార్టీ నీతి అని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి ముఖ్య నేతల సమావే శంలో మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ 'కవిత ఒక మహానటి. పదేండ్లలో ఆమె ఏనాడైనా బీసీల సంక్షేమం కోసం మాట్లాడిందా? కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టింది. ఆచరణలో పెట్టబోతున్నం. ఎన్నో ఏండ్ల పాటు 42 శాతం రిజర్వేషన్ కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్. ది మా కమిట్మెంట్. ఈనెల 5న పార్లమెంట్లో, 6జంతర్ మంతర్ వద్ద ధర్నా, 7న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కలుస్తున్నం. ప్రజలు ఎంతవరకు సంతోషంగా ఉన్నారు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొం టున్నారో అనే విషయాలను పాదయాత్ర ద్వారా తెలుసుకుంటున్నం. ప్రతి కార్యకర్త కష్టార్జితం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మావారు.. నావారు,, నీవారు అనే మాటే ఉండదు. కష్టపడ్డ వాళ్లకే అవకాశం. కింది స్థాయి నుంచి పనిచేసే వారే అసలైన నాయకులు' అని తెలిపారు.

Tags

Next Story