బండి సంజయ్ వన్ టు వన్ మీటింగ్

బీజేపీ ముఖ్య నేతలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వన్ టు వన్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పార్టీలో తాజా పరిస్థితులు చర్చకు వచ్చినట్లు సమాచారం.జాతీయ నాయకత్వం తీరుపై బండి సంజయ్ దగ్గర సీనియర్ నేతలంతా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్‌లో కఠినంగా వ్యవహరించకుంటే బీజేపీకి నష్టం తప్పదని వారంతా చెప్పినట్లు తెలుస్తోంది.ఇక గ్రూపులు కడుతున్న నేతల్నే జాతీయ నాయకత్వం ప్రోత్సహిస్తోందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి కాకుండా లీకులు ఇస్తున్న నేతలకే అగ్రనేతలు అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారని తమ అసహనాన్ని బండి సంజయ్ ముందు వెళ్లగక్కారు.పార్టీని వీడాలనుకునే వారిని ఆపొద్దని సీనియర్లు చెప్పినట్లు తెలుస్తోంది.బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్య నేతల భేటీలో నిర్ణయించినట్లుగా సమాచారం పార్టీ రాష్ట్ర నాయకత్వం బీసీ గర్జనకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంపైనా సీరియస్‌గా చర్చించినట్లు తెలుస్తోంది.. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అనేలా ప్రజల్లోకి వెళ్లాలని సమావేశంలో నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాలంటున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com