Bandi Sanjay : హైడ్రా పేరుతో రేవంత్ వసూళ్లు.. స్వరం పెంచిన బండి సంజయ్

Bandi Sanjay : హైడ్రా పేరుతో రేవంత్ వసూళ్లు.. స్వరం పెంచిన బండి సంజయ్

హైడ్రా పేరుతో తెలంగాణ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్‌ పార్టీ వేల కోట్లు దండుకున్నట్లే ఇప్పుడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ కూడా వేలకోట్ల ఆదాయం సంపాదించుకుంటోందన్నారు. బీజేపీ ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుందని, వారి కోసం ఒంటరిగానే పోరాటం చేస్తుందని చెప్పారు. కుటుంబ వారసత్వ పార్టీలంటేనే అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, డీఎంకేసహా కుటుంబ పార్టీల్లో కార్యకర్తకు ముఖ్యమైన పదవులు ఇవ్వరా అని ప్రశ్నించారు బండి సంజయ్‌.

Tags

Next Story