Bandi Sanjay : రేవంత్ కు పాదయాత్ర చేసే దమ్ముందా?.. బండి సంజయ్ ఎటాక్

"మూసీ పునరుజ్జీవంపైన సీఎం పాదయాత్ర చేస్తానంటున్నడు. ఇప్పుడేమో ట్విట్టర్ టిల్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తాడట. ఈ రెండు పార్టీలు ఒక్కటే కదా ? 6 గ్యారంటీ ల పేరుతో ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక మోసం చేసిన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్
దైతే, గత 10 ఏళ్ల పాలనలో ప్రజలను అడుగడుగునా మోసం చేసిన ట్విట్టర్ టిల్లు ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ది. మీ ఇద్దరూ చేయాల్సింది పాదయాత్ర కాదు. మోకాళ్ల యాత్ర.” అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైరయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని చెప్పిన బండి సంజయ్ ‘ఇద్దరూ కలిసి అటు నుండి ఒకరు ఇటు నుండి ఇంకొకరు పాదయాత్ర చేసుకోండి. ఆ తరువాత మీరిద్దరూ కలిసి బహిరంగ సభ పెట్టుకుని రాహుల్ గాంధీ, కేసీఆర్ లను పిలుచుకోండి."అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చేతనైతే 6 గ్యారంటీలపై పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాల్లో పర్యటించిన బండి సంజయ్ కుమార్ స్థానిక బీజేపీ నేతలను కలుసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com