ఆ రెండు పార్టీలను తరిమికొట్టడమే ధ్యేయం : బండి సంజయ్

గ్రేటర్ ఎన్నికల్లో భాగ్యనగరంలోని గోల్కొండపై కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజా సమస్యలు పట్టకుండా ఫామ్ హౌజ్‌లో సేద తీరే సీఎం కేసీఆర్ పార్టీ టీఆర్‌ఎస్‌కు, అటు మజ్లిస్ పార్టీకి గ్రేటర్ ఎన్నికల్లో పరాజయం తప్పదన్నారు. ఈ రెండు పార్టీలను తరిమికొట్టడమే ధ్యేయంగా బీజేపీ కార్యకర్తలు సిద్ధమయ్యారని బండి సంజయ్ అన్నారు. ఆల్వాల్ టీం... సాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫాగింగ్ యంత్రాలను ఆయన ప్రారంభించారు. కరోనా కష్టాల్లో ఉంటే కనీస సౌకర్యాలు కల్పించకుండా కేసీఆర్ సర్కార్ దారుణంగా వ్యవహరిస్తోందంటూ బండి సంజయ్ మండిపడ్డారు. కార్పొరేట్ ఆసుపత్రుల కొమ్ముకాస్తూ సామాన్య ప్రజలకు వైద్యం అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచంద్రారావు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com