TG : బీఆర్ఎస్ పనైపోయింది : బండి సంజయ్

TG : బీఆర్ఎస్ పనైపోయింది : బండి సంజయ్
X

రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిం దని, ఆ పార్టీకి కేడర్ లేదని, లీడర్లు గోడమీద పిల్లుల్లా మారారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ యూఎస్ లోని “ఒవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ 'మీటింగ్ లో ఆయన వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బరి తెగించిందని విమర్శిం చారు. ఒక సమస్య వస్తే దానిని పరిష్కరించ కుండా మరో సమస్యను సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతోందన్నారు. హైడ్రా, మూసీ పునరుజ్జీవం, కుల గణన పేరుతో మీడియాలో ప్రచారం చేసుకుంటూ 6 గ్యా రంటీలను దాటవేస్తోందని మండిపడ్డారు. సీఎం హామీ ఇస్తే అమలు కావడం లేదన్నారు. దీంతో సీఎం ఇస్తున్న హామీలకు, చెబుతున్న

మాటలకు విలువ లేకుండా పోయిందని విమర్శించారు. దక్షిణాదికి అన్యాయం పేరుతో కొత్త డ్రామాకు కాంగ్రెస్ తెరలేపిందని విమ ర్శించారు. కేసీఆర్ కుటుంబ, నియంత, అవినీతి పాలనతో విసిగిపోయి మార్పు కోసం కాంగ్రెస్ కు ఓటేసిన ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లయింద న్నారు. 'రైతు భరోసా ఇవ్వడం లేదు. ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ చేయలేదు. నెలరోజులుగా వడ్లను రోడ్లపై పోసి రైతులు ఎదురు చూస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించ లేదు. మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలకు రూ.2500లు ఇస్తామని మోసం చేశారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇయ్యనేలేదు. రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించడం లేదు. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు నో టిఫికేషన్లు ఇస్తోంది. నిబంధనలకు భిన్నంగా ఇస్తున్న నోటిఫికేషన్లను కోర్టులు కొట్టివేసేలా చేస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదు పుతున్నయ్. దేవాలయాలపైన, హిందూ ధర్మంపైన దాడులు జరుగుతున్నా పట్టించు కోవడం లేదు.' అని బండి సంజయ్ మండిపడ్డారు.

Tags

Next Story