TG : తెలంగాణలో వినాశకర పాలన .. ఏడాది మొత్తం దారుణాలే : బండి సంజయ్ ట్వీట్

కాంగ్రెస్ దోపిడీదారులు, విధ్వం సకారులు, అబద్ధాల పార్టీగా మారిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఏఐసీసీ మొత్తం ఫేకన్న్యూస్పెడ్లర్లతో నిండిపోయిందని ఆరోపిం చారు. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పొందలేదన్నారు. 'రాష్ట్రంలో మహిళలకు సాధికారత కల్పించడానికి బదులుగా వారిని చితకబాదారు. అంతేకా కుండా ఇండ్లను పడగొట్టడం, వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడం, గర్భిణీలను వీధుల్లోకి నెట్టారు. ఇది పాలన కాదు. ఇది మహిళలపై వ్య వస్థీకృత క్రూరత్వం. కాంగ్రెస్ ఏడాది వినాశకర మైన పాలనలో లైంగికదాడి కేసులు 28.94%, మహిళల హత్యలు 13%, కిడ్నాప్లు, అపహర ణలు 26% పెరిగాయి. కాంగ్రెస్ హయాంలో 10 వేలమంది మహిళలు బహిరంగ ప్రదేశాల్లో వేధిం పులకు గురయ్యారు. వారువాగ్దానం చేసిన భద్రత ఎక్కడుంది 'అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com