Bandi Sanjay : జంతు కొవ్వు వాడినా జగన్ పట్టించుకోలేదు.. బండి సంజయ్ ఫైర్

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఇది క్షమించరాని నేరమని.. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ రాశారు. ఈ వ్యవహారం శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలచివేస్తోంది.
"తిరుమల పవిత్రతను దెబ్బతీశారని, అన్య మత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు. జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదంలో వినియోగించారని మీరు చేసిన వ్యాఖ్యలతో కల్తీ నిజమేనని యావత్ హిందూ సమాజం భావిస్తోంది. ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగిం చడం అత్యంత నీచం. దీన్ని హిందూ ధర్మంపై జరిగిన భారీ కుట్రగానే భావిస్తున్నాం. లడ్డూ ప్రాముఖ్యతను తగ్గించేం దుకు టీటీడీపై కోట్ల మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకు ఈ కుట్ర చేశారు.. క్షమించరాని నేరానికి ఒడిగట్టారు..." అని పేర్కొన్నారు. తక్షణమే సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com