Bandi Sanjay Kumar : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం : బండి సంజయ్

వెనుకబడిన ప్రాంతాల అభి వృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశంలో వెనుబడిన ప్రాంతాలను అభివృద్ధి పర చడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. ఇవాళ నారా యణపేట జిల్లా నర్వ మండలంలోని రాయికోడ్ గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామానికి వచ్చిన బండిసంజయ్కు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని పలు వార్డుల్లో పర్యటించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ సెంటర్, ప్రభుత్వ దవాఖానాను పరిశీలించారు. ప్రభుత్వ స్కూల్విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరంకలెక్టరేట్ లోసమీక్ష సమావేశంలో ఎంపీ డీకే అరుణ, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మూడు జిల్లాల్లో 10 మండలాలను వెనుకబ డిన ప్రాంతాలుగా గుర్తించిందన్నారు. నీతి అయోగ్ కింద మరో ఐదు మండలాలను ఏంపిక చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అంది స్తున్న నిధులు గ్రామస్థాయిలో మంచి ఫలితాలు వస్తూన్నాయా..? పేదల ప్రజలను కేంద్రం సాయం ఏ విధంగా అందిస్తున్నారు..? నీతి అయోగ్ ద్వారా గుర్తించిన ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం ఎలా ఉంది? రాబోయే రోజుల్లో ఇంకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నా రు. సెంట్రల్ స్కీంలపై స్థానికుల ఏలాంటి అవగాహన కల్పిస్తున్నారనే విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇవాళ ఈ ప్రాంతాని ఈ కి సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న స్కీంలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఏ విధంగా సద్వనియోగం చేసుకోంటున్నారో క్షేత్రస్థాయి లో తెలుసుకోవడానికి ఇక్కడి వచ్చామన్నారు. పేదరికంలో ఉన్న ప్రాంతాలను ప్రభుత్వం దశ లవారీగా అభివృద్ధి చేస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్కీంలను నిజమైన లబ్ధిదారులకు అందించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం ప్రకటిం చారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పై కలిపి పోరాడుతామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com