Bandi Sanjay : తెలంగాణలో పటేల్ విగ్రహం పెడతాం.. బండి సంజయ్ సంచలనం

Bandi Sanjay : తెలంగాణలో పటేల్ విగ్రహం పెడతాం.. బండి సంజయ్ సంచలనం
X

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ లో మాట్లాడిన సంజయ్.. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేయడం కాంగ్రెస్ రాజకీయ డ్రామాలకు నిదర్శనం అని విమర్శించారు. హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజీవ్ విగ్రహం అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

తెలంగాణలో సర్దార్ పటేల్ 'ఆపరేషన్ పోలో' పేరుతో చేసిన సాహసం వల్లే నేడు నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్ వల్లభాయి పటేల్ ముమ్మాటికీ బీజేపీకి వీరుడే.. ఆ పటేల్ వారసులమని చెప్పుకునేందుకు తాము గర్విస్తున్నామన్నారు.

'తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం' దేనికోసం.. ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నించారు సంజయ్. నిజాంపై పోరాడి ప్రాణాలర్పించిన త్యాగాలను వారి కుటుంబాలను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే 'తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం' కార్యక్రమానికి హాజరు కావడం లేదని స్పష్టంచేశారు బీజేపీ నేతలు.

Tags

Next Story