95వ రోజుకి చేరిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 95వ రోజు నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. చిన్న సూరారం గ్రామం నుంచి ప్రారంభమైంది పాదయాత్ర.దారి పొడవునా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు భట్టి విక్రమార్క.భట్టికి తమ గోడును చెప్పుకున్నారు ఉపాధి హామీ కూలీలు.పనిచేసే దగ్గర టెంట్, మంచినీళ్ల సౌకర్యం కూడా లేవని ఫిర్యాదు చేయగా వచ్చే ఎన్నికల తరువాత ఏర్పడే ఇందిరమ్మ రాజ్యంలో మీ సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు ఆర్లగూడెం దగ్గర భట్టికి తమ గోస చెప్పుకున్నారు నిరుద్యోగులు తమ కన్నీటి గాధలను చెప్పుకున్నారు.ఎంతో కష్టపడి చదువుకొని గ్రూప్స్‌కు ప్రిపేర్ అయితే ఫలితాల వచ్చే వేళ పేపర్ లీక్ కావడంతో ఏమిచేయలేక వ్యవసాయ పనులు చేసుకోవాల్సి వస్తుందని వాపోయారు. నిరుద్యోగుల సమస్యలు విన్న భట్టి వారికి భరోసా ఇచ్చారు. కాంగ్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com