TG : జీవో 29ను రద్దు చేయాలంటూ గవర్నర్‌కు బీసీ సంఘాల విన్నపం

TG : జీవో 29ను రద్దు చేయాలంటూ గవర్నర్‌కు బీసీ సంఘాల విన్నపం
X

బీసీలకు అన్యాయం చేసే జీవో నెంబర్ 29ను రద్దు చేయాలంటూ గవర్నర్‌ను కలిశారు బీసీ సంఘాల నేతలు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. 8 శాతం ఉన్న అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. బీసీలను నాశనం చేసే జీవో 29 తక్షణమే రద్దు చేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. లేదంటే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్ కు పడుతుందని హెచ్చరించారు. బేషజాలకు పోకుండా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు.

Tags

Next Story