పురపోరులో బీసలకు 42 శాతం రిజర్వేషన్ల సంగతేంటి..?

తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. మరికొన్ని రోజుల్లో నోటిఫికేషన్ కూడా రాబోతోంది. ఈ క్రమంలోనే పురపోరులో బీసీల రిజర్వేషన్ల అంశం మీద చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి స్థానిక ఎన్నికల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ దానిక సుప్రీంకోర్టు నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. హైకోర్టులో కోర్టు తీర్పు రావాల్సి ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు బీసీలకు చట్టపరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అవకాశాలు ఎలాగూ లేవు. కానీ కాంగ్రెస్ మాత్రం పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు ఇది ఎంత వరకు సాధ్యం అనేది ఎవరికీ అర్థం కావట్లేదు.
అటు నుంచి బీఆర్ ఎస్, బీజేపీ పార్టీలు మాత్రం బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి ప్రకటనలు చేయట్లేదు. పార్టీ పరంగా ఈ రెండు పార్టీలు కూడా ఇస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే బీసీ సంఘాలు మాత్రం తమకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలంటూ పట్టుబడుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం తాము అన్ని విధాలుగా ప్రయత్నించామని.. బీఆర్ ఎస్, బీజేపీ పార్టీలు ఈ విషయంలో కలిసి రాలేదంటూ చెబుతోంది. అయితే బీఆర్ ఎస్ తో పాటు బీజేపీ పార్టీ మాత్రం రిజర్వేషన్ల పేరుతో బీసీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటోందని.. చట్టబద్ధంగా సాధ్యం కాదని తెలిసినా సరే సెంటిమెంట్ ను రెచ్చగొడుతోందని అంటున్నాయి.
కాంగ్రెస్ చెబుతున్నట్టు పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఎంత వరకు సాధ్యం అవుతుందనేది తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ లో జనరల్ స్థానాల్లో ఎక్కువగా పోటీ ఉంటోంది. అన్ని వర్గాల నుంచి అక్కడ బలమైన కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో ఇతర వర్గాలను ఎలా ఒప్పిస్తారనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. బీసీల రిజర్వేషన్ల అంశం తెరమీదకు వచ్చిన తర్వాత పార్టీ గుర్తులపై జరుగుతున్న మొదటి ఎన్నికలు కాబట్టి ఇవి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రకంగా సవాల్ గానే ఉన్నాయని చెప్పుకోవాలి. మరి ఇన్ని రోజుల పాటు మాటల్లో చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు చేతల్లో ఏ మేరకు చేసి చూపిస్తుందో వేచి చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
