Teenmaar Mallanna : బీసీలు హెలికాప్టర్లను కొంటారు.. తీన్మార్ మల్లన్న స్ట్రాంగ్ రిప్లై

Teenmaar Mallanna : బీసీలు హెలికాప్టర్లను కొంటారు.. తీన్మార్ మల్లన్న స్ట్రాంగ్ రిప్లై
X

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హెలికాప్టర్ లో వరంగల్ బీసీ సమరభేరి సభకు హాజరవ్వడం హాట్ టాపిక్ అయింది. ఓ టీవీ ఛానల్ లో దీనిపై ఎదురైన ప్రశ్నకు తీన్మార్ మల్లన్న దీటైన సమాధానం చెప్పారు. బీసీలు హెలికాప్టర్లో తిరగొద్దా అని ఎదురు ప్రశ్నించారు. బీసీల వద్ద అంతులేని సంపద ఉందని.. హెలికాప్టర్లు ఎక్కడం కాదు.. బీసీలు అవసరమైతే హెలికాప్టర్లు కొని తిరుగుతారని చెప్పారు. బీసీ ఓట్లు ఒక్కటి చేసి రాజ్యాధికారం సాధిస్తామని ధీమాగా చెప్పారు. రెడ్లపై తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని.. కామెంట్ పెట్టిన ఒక్క వ్యక్తినే విమర్శించానని స్పష్టత ఇచ్చారు మల్లన్న.

Tags

Next Story