Miss World Contestants : దేవర పాటకు అందగత్తెల స్టెప్పులు

Miss World Contestants : దేవర పాటకు అందగత్తెల స్టెప్పులు
X

పలు తెలుగు డీజే పాటలకు కూడా అందగత్తెలు డ్యాన్స్ చేసి అలరించారు. అంతకుముందు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ యోగాస నాలు చేశారు. పది క్రీడాంశాల్లో పోటీలు ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా స్పోర్ట్స్ ఫైనల్స్ లో అందగత్తెలకు యోగా, బాడ్మింట న్, స్ప్రింట్ వంటి మొత్తం పది క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. అమెరికన్ & కరేబియస్, ఆఫ్రికా, ఆసియా, యూరప్ టీమ్ లుగా విభజించారు. చివరలో జుంబా సెషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జూపల్లి కృష్ణారా వు, మిస్ వరల్డ్ ఫౌండర్ జూలియా మోర్లీ, ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, ఎంపీ, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాల, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ మల్లారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ టూరిజం హనుమంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మిస్ వరల్డ్ అంటే బ్యూటీ ఒక్కటే కాదు. ప్రపంచంలోని భిన్న సంస్కృతులు ఒకే స్టేజీ మీదకి తీసుకొస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Tags

Next Story