Kishan Reddy : మహిళా లోకానికి బేగంపేట రైల్వే స్టేషన్ అంకితం : కిషన్ రెడ్డి

Kishan Reddy : మహిళా లోకానికి బేగంపేట రైల్వే స్టేషన్ అంకితం : కిషన్ రెడ్డి
X

త్వరలోనే బేగంపేట రైల్వే స్టేషన్ ను అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ స్టేషన్ ను మహిళ లోకానికి అంకితం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇవాళ రూ.26 కోట్లతో జరు గుతున్న బేగంపేట రైల్వే స్టేషన్ లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యా ప్తంగా 1200 రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేస్తే ఇందులో రూ.2736 కోట్లతో రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ. 715 కోట్లుతో సికింద్రాబాద్ స్టేషన్ రీ డెవలప్ మెంట్ పనులు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది కల్లా అందుబాటులోకి తీసుకువస్తామ న్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు తరహాలో సి కింద్రాబాద్ రైల్వే స్టేషను మారుస్తామన్నారు. బేగంపేట రైల్వే స్టేషన్లో ఫేజ్ -2లో భాగంగా రూ. 12 కోట్లతో చేపట్టిన పనుల్లో మిగిలిన 10 శాతం పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ‘ ప్రధాని మోదీ ప్రభుత్వం రూ. 5,331 కోట్ల తో ఈ ఏడాది రైల్ బడ్జెట్ కేటాయించింది. బేగంపేట రైల్వే స్టేషన్ లో మొత్తం మహిళలే ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నం. కవచ్ టెక్నాలజీ ద్వారా ప్ర . మాదాలను నివారించేలా ఆలోచనలు చేస్తున్నం. రానున్న రోజుల్లో సికింద్రాబాద్కు కవచీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రానుంది. సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్లకు అప్రోచ్ రోడ్డు ల కోసం భూసే కరణ చేయాలని సీఎంకు లేఖ రాశాం. ఇంకా రోడ్ల పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ కు 5 వందే భారత్ ట్రైన్లు వచ్చాయి. రానున్నరోజుల్లో రైల్వే కాసింగ్ మ్యానువల్ స్టిసం తీసుకువస్తున్నం. ' అని కిషన్ రెడ్డి అన్నారు.

Tags

Next Story