Bhatti Vikramarka : బీఆర్ఎస్ హయాంలో కంటే మా పాలనలోనే ఎక్కువ రుణమాఫీ: భట్టి

మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ సొంత నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ హయాంలో కంటే కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ రుణమాఫీ జరిగిందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గజ్వేల్‌లో అప్పట్లో రూ.104 కోట్ల రుణమాఫీ జరిగితే ఇప్పుడు రూ.237 కోట్లు, సిద్దిపేటలో గతంలో రూ.96 కోట్ల మాఫీ అయితే తమ పాలనలో రూ.177 కోట్లు, సిరిసిల్లలో అప్పుడు రూ.101 కోట్లు మాఫీ చేస్తే తాము రూ.175 కోట్ల మాఫీ చేసినట్లు వెల్లడించారు.
అసెంబ్లీలో రైతు రుణమాఫీపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సగం మందికి కూడా మాఫీ జరగలేదన్నారు. దీంతో రైతుల వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ జిల్లాల వారీగా ఎన్నికోట్ల మాఫీ జరిగిందో భట్టి చదివి వినిపించారు.
మరోవైపు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో హరీశ్ రావు, తలసాని, మాధవరం కృష్ణారావు, సబితారెడ్డి, సుధీర్ రెడ్డి, వివేకానంద ఆయనను కలిశారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అన్యాయమని వారు పేర్కొన్నారు. స్పీకర్‌ను ఏకవచనంతో పిలవలేదని, సభా సంప్రదాయాలను ఆయన ఉల్లంఘించలేదని వారు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com