TG High Court : హరీశ్ రావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

మాజీ మంత్రి హరీశ్ రావుకు హైకో ర్టులో రిలీఫ్ దక్కింది. ఆయనపై దాఖలైన ఎన్నికల పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఎలక్షన్ అఫిడవిట్లో హరీశ్ తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని పేర్కొంటూ చక్రధర్ గౌడ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆస్తుల వివరాలు సరిగా వెల్లడించలేదని, ఈ విషయంలో ఎన్నికల నియమాలు ఉల్లంఘించారని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. దీంతో ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. అక్రమ కేసులకు భయపడ: హరీశ్ రావు తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ నయవంచనను ఎండగడ తామన్నారు. రేవంత్ రెడ్డి కుట్రలు ఫలించడం లేదని, ఇప్పటికైనా కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com