TG : ఇంజినీరింగ్ విద్యార్థులకు బిగ్ షాక్

ఇంజినీరింగ్ విద్యార్థులకు బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫీజులపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఫీజులపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా 52% నుంచి 84% ఫీజులు పెంచాలని ప్రభుత్వంపై కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి. ఇదిలా ఉండగా.. సీబీఐటీలో లక్షా 73వేలు, వాసవి, వర్ధమాన్, సీవీఆర్, బీవీఆర్ ఐటీ మహిళా కాలేజీల్లో లక్షా 55వేలు, శ్రీనిధి, వీఎన్‌ఆర్ జ్యోతి వంటి కాలేజీల్లో లక్షా 50వేలపై చొప్పున ఫీజులు పెంచినట్టు సమాచారం. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో మిగతా కాలేజీలు సైతం ఫీజులను భారీగా పెంచే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com