TG : నాగర్ కర్నూలు గ్రామ శివారులో పెద్దపులి సంచారం.. స్థానికులు హడల్

TG : నాగర్ కర్నూలు గ్రామ శివారులో పెద్దపులి సంచారం.. స్థానికులు హడల్
X

నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. B.K.తిరుమలాపూర్‌ గ్రామ శివారులో పెద్దపులి సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామ శివారులోని ఎల్లమ్మ దేవాలయం సమీపంలో రోడ్డు పక్కన సంచరిస్తున్న పెద్దపులిని అటుగా వెళుతున్న స్థానికులు గమనించారు. కొద్దిసేపు రోడ్డు పక్కన అటు ఇటుతిరిగిన తర్వాత పులి చెట్ల పొదల్లోకి వెళ్ళిపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతానికి ఈ గ్రామం దగ్గరగా ఉండటంతో తరచుగా వన్యప్రాణులు సంచరిస్తూ ఉంటాయని అటవీశాఖాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పులులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు.

Tags

Next Story