Bikshamaiah Goud: బీజేపీలో చేరిన టీఆర్‌ఎస్‌నేత బిక్షమయ్య గౌడ్

Bikshamaiah Goud: : టీఆర్‌ఎస్ నేత.. మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జీ తరుణ్ చుగ్, రాష్ట్రఅధ్యక్షుడు బండిసంజయ్ సమక్షంలో ఢిల్లీలో కమలం కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బండిసంజయ్ విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేకుండా.... కేంద్రాన్ని బదనాం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం మాట్లాడే ప్రతిమాట తప్పుదోవ పట్టించేదిగా ఉందన్నారు. ఇంకా బీజేపీలో చేరేందుకు చాలామంది సిద్దంగా ఉన్నారన్నారు. కుటుంబ పాలన, అరాచక పాలన అంతం చేయాలన్నదే అందరి లక్ష్యం అని బండి అన్నారు. డ్రగ్స్ కేసులో ఇంతవరకు ఎవరిని ఎందుకు అరెస్టుచేయలేదని.. సీఎం దీనిపై ఎందుకు స్పందించడంలేదని బండి సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com