Harish Rao : కాంట్రాక్టర్లకు బిల్లులిస్తరు.. విద్యార్థులకు ఫీజు చెల్లించరా?

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని, వారి చదువును, జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శిం చారు. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులిస్తారు గానీ డిగ్రీ కాలేజీలకు 800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించరా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ పలు వర్సిటీల పరిధిలో డిగ్రీ పరీక్షలను నిర్వహించకపోవడం దారుణమన్నారు. దీంతో 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని పేర్కొన్నారు. 'కళాశాల యాజమాన్యాలు అప్పులు తెచ్చి బోధన, బోధనే తర సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్న పరిస్థితి. అద్దెలు, అప్పులు పెరిగిపోవడంతో ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లను నిలిపివేయగా, కొన్నిచోట్ల కళాశాలలకు తాళం వేసి ఇప్పటికే సెలవులు ప్రకటించారు. ఇంత జరుగుతుంటే తమకేమీ పట్టనట్లు సీఎం, మంత్రులు వ్యవహరిస్తుండ డం సిగ్గుచేటు. యువ వికాసం పేరుతో ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్య భరోసా కార్డు ఇస్తామ ని ఆరు గ్యారెంటీల్లో పెట్టారు. దానికి అతి గతి లేదు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లిస్తా మని మొన్న నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రిగా ఉన్న రేవంత్రెడ్డి చెప్పిన మాటలు గాలి మాటలే అయ్యాయి. రెండు నెలల్లో మొత్తం బకాయిలు క్లియర్ చేస్తామని, కళాశాల యాజమాన్యాలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ నీటి మూటలే అయ్యాయి. ఏడాదిన్నర పాలనలో విద్యావ్యవ స్థలో తెచ్చిన కాంగ్రెస్ మార్కు మార్పు ఇది. ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులు? అని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com