Bird Flu : మళ్లీ విజృంభించిన బర్డ్ ఫ్లూ..

Bird Flu : మళ్లీ విజృంభించిన బర్డ్ ఫ్లూ..
X

కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టిన బర్డ్ ఫ్లూ మళ్లీ కోరలుచాస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి, భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం ప్రాంతాల్లో ఈ మహమ్మారిని అధికారులు గుర్తించారు. నివారణ చర్యల్లో భాగంగా బయోసేఫ్టీ సిబ్బంది 2 లక్షల కోళ్లను తొలగించారు. అధికారులు పరిసరాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. కోళ్ల ఫుడ్, వ్యర్థాలు సహా అన్నింటినీ క్లియర్ చేస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. అంతేకాకుండా.. ఆ ప్రాంతం అంతా శానిటైజ్ చేశారు. ఎక్కడైతే కోళ్ల ఫామ్స్ ఉంటాయో.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించారు. సమీప గ్రామ ప్రజలను కూడా అటువైపు రావద్దంటూ అధికారులు సూచించారు.

Tags

Next Story