Huzurabad bypoll: టీఆర్‌ఎస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ

Huzurabad bypoll: టీఆర్‌ఎస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ
X
Huzurabad bypoll: ఒకరినొకరు తోసేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Huzurabad Bypoll: జమ్మికుంటలో ఓటు వేయడానికి వెళ్తున్న మహిళపై టీఆర్‌ఎస్ నాయకులు చేయి చేసుకున్నారంటూ ఆరోపించారు బీజేపీ నాయకులు. మున్సిపల్ ఛైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వరరావుతో పాటు ఆయన అనుచరులపై బీజేపీ విమర్శలు గుప్పించింది.

దీంతో కొద్దిసేపు టీఆర్‌ఎస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరినొకరు తోసేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన సీపీ సత్యనారాయణ పరిస్థితిని అదుపుచేశారు.

Tags

Next Story