TG : 27న పోలింగ్.. ఎమ్మెల్సీ విజయంపై బీజేపీ ధీమా.. ఈ సాయంత్రం నుంచే వైన్స్ బంద్

ఈ నెల 27న పోలింగ్ జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటీలో లేకపోవడంతో చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ ను మట్టికరిపిం చాలన్న వ్యూహాన్ని కమల నాథులు పన్నినట్టుగా స్పష్టమవుతోంది. అదే సమయం లో గత అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిదేసీ సీట్ల చొప్పున గెలుచుకున్న బీజేపీ... రానున్న 2028 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం లో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ఈ నెల 27న పోలింగ్ జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను సీరియస్ గా తీసుకుంది. మూడు స్థానాలను తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాటు ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, పాయల్ శంకర్, కాటిపల్లి వెంక ట రమణా రెడ్డి, తదితరులు ముమ్మ రంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచా రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రచారంలో బాగం గా సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ మధ్య నెలకొన్న విమర్శలు, ప్రతివిమర్శలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిం చాయి. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు.. పోలింగ్ కు కొన్ని గంటల ముందే వైన్ షాప్స్ బంద్ కానున్నాయి. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఈ సాయంత్రం నుంచి ఆంక్షలు విధించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com