T BJP: బండి.. దిగిపోనున్నారా..!

T BJP: బండి.. దిగిపోనున్నారా..!
తెలంగాణా బీజేపీలో సంక్షోభానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు హైకమాండ్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణా బీజేపీలో సంక్షోభానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు హైకమాండ్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.రెండ్రోజుల్లో దీనిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. పార్టీ వ్యవహారాలు గాడిలో పెట్టేలా ఈ నిర్ణయాలు ఉంటాయంటున్నారు బీజేపీ ముఖ్యలు.కొంతకాలంగా తెలంగాణా బీజేపీలో ముఖ్య నేతల అంతర్గత పోరాటాలు వీధికెక్కాయి.పాత, కొత్త నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. దీంతో తెలంగాణా బీజేపీ పరిణామాలపై దృష్టి సారించింది జాతీయ నాయకత్వం వీటిన్నింటికి హైకమాండ్ ఫుల్ స్టాప్ పెడుతుందంటున్నాయి బీజేపి వర్గాలు. కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డిని తప్పించి తెలంగాణా పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆయన్ను కేంద్ర మంత్రిగా కొనసాగిస్తూనే పార్టీ బాధ్యతలూ ఇస్తారని మరో ప్రచారం సాగుతోంది.మొత్తానికి బండి సంజయ్ మార్పు తథ్యమని, ఆయన్ను కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారంటున్నారు బీజేపీ నేతలు.ఇక సీనియర్ నేత లక్ష్మణ్ ను కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అటు ప్రజల ఆశ్వీరదించే సందర్భం ఆసన్నమైందని ఇటీవలే ప్రకటించారు ఈటల రాజేందర్.తెలంగాణా బీజేపీలో కీలక బాధ్యతల కోసం ఆయన ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఇక బీజేపీలో పరిణామాలపై సీనియర్ నేత జితేందర్ రెడ్డి పోస్టు చేసిన వీడియోపై చర్చ సాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story