BJP: తెలంగాణపై పుల్ ఫోకస్..

BJP: తెలంగాణపై పుల్ ఫోకస్..
వరంగల్‌కు ప్రధాని మోదీ వస్తుండగా రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ వస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ పుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేసిన కమలం పార్టీ ఇక జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇవాళ వరంగల్‌కు ప్రధాని మోదీ వస్తుండగా రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ వస్తున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశంలో నడ్డా పాల్గొంటారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది.త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల టార్గెట్‌గా బీజేపీ ఈ కీలక సమావేశంలో వ్యూహాలు సిద్ధం చేస్తోంది.

అటు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు నియమించింది.తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ప్రకాష్ జవదేకర్‌కు బాధ్యతలు అప్పగించిన బీజేపీ అధిష్టానం సహ ఇన్‌ఛార్జ్‌గా సునీల్ బన్సల్‌ నియమించింది.రాజస్థాన్ ఇన్‌ఛార్జ్‌గా ప్రహ్లాద్ జోషి,మధ్యప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్‌, ఛత్తీస్‌గఢ్ ఇన్‌ఛార్జ్‌గా ఓం ప్రకాష్ మాథుర్‌, మాండవియాలను ప్రకటించింది. బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలు 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశాలతో తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story