మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి స్పెషల్ ప్లాన్..

మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి స్పెషల్ ప్లాన్..
X

తెలంగాణ బిజెపి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యేక ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. గ్రామాల్లో పెద్దగా పట్టులేదు అని చెప్పుకునే పరిస్థితిల నుంచి.. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో గతం కంటే కొంత ఎక్కువ సీట్లు సాధించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక అర్బన్ లో మంచి పట్టు ఉండే తమకు ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వచ్చేలా ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు వెళుతున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రామ్ చందర్ రావు ఇప్పటికే జిల్లాల పర్యటన చేపట్టారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలకు స్పెషల్ టాస్కులు ఇస్తున్నారు. వాళ్ల నియోజకవర్గ పరిధిలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిందిగా టార్గెట్లు ఇస్తున్నారు అంట.

ఇప్పుడు సాధించే మునిసిపల్ ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎఫెక్ట్ చూపిస్తాయని తెలిసిందే. ఉత్తర తెలంగాణ జిల్లాలు అయిన కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ తోపాటు మెదక్ పార్లమెంటు స్థానంలో మెజార్టీ సీట్లు సాధించాల్సిందిగా పార్టీ నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు అక్కడే ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్పెషల్ టార్గెట్లు ఇచ్చారంట. ఈ జిల్లాలోనే బిజెపికి ఎక్కువగా పట్టుంది కాబట్టి.. అక్కడ జరిగే మున్సిపాలిటీ చైర్మన్ పదవులను దక్కించుకోవాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.

ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలని అంశాన్ని కూడా లోకల్ గా ఉండే ఎమ్మెల్యేలు చూసుకుంటున్నారంట. ఈసారి మున్సిపల్ ఎన్నికలు మొత్తం ఎమ్మెల్యేల చేతుల మీద గానే నడిపించేలా ప్లాన్ రెడీ చేశారు. రామ్ చందర్ రావు ఈ మున్సిపల్ ఎన్నికలు అయిపోయే దాకా జిల్లాల్లో పర్యటిస్తూ ఆయా ఎమ్మెల్యేలు ఎంపీలతో సమన్వయం అవుతూ కావాల్సిన వ్యూహాలు, ఆర్థిక వనరులను కూడా సమకూర్చబోతున్నట్టు సమాచారం. మరి గత మునిసిపల్ ఎన్నికల్లో మంచి సీట్లు సాధించిన బిజెపి.. ఈసారి ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో వేచి చూడాలి.

Tags

Next Story