తెలంగాణ వైపు చూడని బిజెపి పెద్దలు.. ఎందుకు..?

తెలంగాణ వైపు చూడని బిజెపి పెద్దలు.. ఎందుకు..?
X

బిజెపి ఢిల్లీ పెద్దలు తెలంగాణ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడట్లేదు. మరీ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు తెలంగాణను పట్టించుకోవట్లేదు. మొన్నటికి మొన్న కంటోన్మెంట్ ఉపఎన్నిక వచ్చినప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు ఇటువైపు రాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల వరకు వరుసగా ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు చాలాసార్లు వచ్చారు. తెలంగాణలో వరుస పర్యటనలు పెట్టుకొని ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక తెలంగాణ కంటే ఇతర రాష్ట్రాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పక్కనే ఉన్న ఏపీకి ఇప్పటికే ఐదు సార్లు వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. కానీ పక్కనే ఉన్న తెలంగాణకు మాత్రం ఇప్పటివరకు రాలేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి గెలుస్తుందని చెప్పే ఢిల్లీ పెద్దలు.. ఆ మేరకు ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు అని కిందిస్థాయి కేడర్ పదే పదే ప్రశ్నిస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ కావాలనే తెలంగాణకు తన పర్యటన పెట్టుకోవట్లేదని తెలుస్తోంది. హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే మూడుసార్లు షెడ్యూల్ పెట్టుకొని కాన్సిల్ చేసుకున్నారు. బిజెపి తెలంగాణ ఇన్చార్జ్ గా ఉన్న సునీల్ బన్సాల్ కూడా చాలాసార్లు మీటింగ్ లకు వస్తానని చెప్పి డుమ్మా కొడుతున్నారు. సాధారణంగా ఏదైనా రాష్ట్రంలో ఉప ఎన్నిక వస్తే కచ్చితంగా మోడీ రాకపోయినా అమిత్ షా అయినా వస్తుంటారు. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బిజెపి కేంద్ర పెద్దలు ఎవ్వరూ రావట్లేదు. బిజెపిలో అత్యంత కీలకంగా ఉండే ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నారు. ఇలా కేంద్ర పెద్దలు రాకపోవడానికి కారణం బిజెపి రాష్ట్ర నాయకులే అని ప్రచారం జరుగుతుంది.

బిజెపి రాష్ట్రస్థాయి నాయకులు ఎవరి దారి వారిదే అన్నట్టు ప్రవర్తిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక ఎవరి పదవులు వారు తీసుకొని పార్టీని పట్టించుకోకుండా సొంత ఇమేజ్ కోసం కష్టపడుతున్నట్టు బిజెపి ఢిల్లీ పెద్దలకు తెలిసింది. కింది స్థాయి కేడర్ ను పట్టించుకోకుండా ఎవరి దారి వారు చూసుకుంటున్నారనే ఆరోపణలు పార్టీలో ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఆ విషయాలు ఢిల్లీ పెద్దల దాకా వెళ్లాయని సమాచారం. అందుకే రాష్ట్ర పెద్దల మధ్య సమన్వయం లేక ఢిల్లీ పెద్దలు కూడా ఇటువైపు చూడట్లేదని తెలుస్తోంది. ఎంతో కఠిన రాష్ట్రాలను కూడా తమ దారిలోకి తెచ్చుకునే ఢిల్లీ పెద్దలు.. తెలంగాణలో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిసినా కూడా రాష్ట్ర నేతల వ్యవహారం చూసి ఇటువైపు పెద్దగా ఫోకస్ పెట్టట్లేదని సమాచారం. అందుకే జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కూడా స్టార్ క్యాంపైనర్ల లిస్టులో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొందరు కీలక నేతలను మాత్రమే చేర్చారు.

Tags

Next Story