Budget Allocation : రాష్ట్ర బడ్జెట్ లో మహిళలకు ఇచ్చింది గాడిద గుడ్డు

రాష్ట్ర బడ్జెట్లో మహిళలకు సరైన నిధులు కేటాయింపు జరగలేదంటూ శుక్రవారం బీజేపీ మహిళా మోర్చా నేతలు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు మహిళా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ బడ్జెట్లో మహిళలకు ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప ఏమీ లేదన్నారు. ఆందోళన చేస్తున్న మహిళా మోర్చా నేతలను పోలీసులు అరెస్టు చేశారు.'ప్రతి మహిళకు రూ.2500, ప్రతి నెల రూ. 4వేల పెన్షన్, అమ్మాయిలకు స్కూటీ ఇస్తామని కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. మహిళల విషయంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తున్నాం. హామీలు అమలు చేయకపోతే గాంధీ భవన్తో పాటు సీఎం రేవంత్ ఇంటిని ముట్టడిస్తాం' అని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు -శిల్పారెడ్డి హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com