EETALA: కేంద్రంలో ఈటలకు కీలక పదవి
కేంద్రంలో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు కీలక పదవి దక్కింది. లోక్‌సభ జాయింట్ కమిటీ ఆన్ ఆఫీసేస్ ఆఫ్ ప్రాఫిట్ చైర్మన్‌గా ఈటల రాజేందర్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు స్పీకర్ ఆమోదంతో లోక్‌సభ సచివాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటీలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు మెంబర్లుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు సభ్యుడిగా అవకాశం దక్కింది. కాగా, హర్యానాలో బీజేపీ విజయం పట్ల ఈటల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు.
ఆ రోడ్డు తెరిపిస్తా
విజయవాడ జాతీయ రహదారిపైన ఉన్న ట్రాఫిక్‌ను అదిగమించేందుకు పోచంపల్లి- మన్సూరాబాద్ వరకు ఉన్న పాత రోడ్డు తెరిపించే బాధ్యత తీసుకుంటానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూసివేసిన రోడ్డును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గతంలో ఉన్న పాత రోడ్డు మ్యాపును ఈటలకు చూపించారు.
రోడ్డును మూసి వేయడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను, ట్రాఫిక్ సమస్యలను ఎంపీకి వివరించారు. దాదాపు వంద సంవత్సరాలుగా ఉన్న రోడ్డును కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటుతో అధికారులు రోడ్డుకు అడ్డంగా గోడను కట్టి మూసివేశారని తెలిపారు. ప్రజలకు కలుగుతున్న అసౌకర్యంపై దాదాపు 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని నర్సింహారెడ్డి ఎంపీకి వివరించారు. అయినా అధికారులు స్పందించడం లేదని అన్నారు. నగరానికి దూరాన్ని తగ్గించేదిగా ఉన్న మన్సూరాబాద్- పోచంపల్లి రోడ్డును కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తెరిపించడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని అన్నా రు. ఈ రోడ్డును తెరిపించడం వల్ల విజయవాడ జాతీయ రహదారిపైన ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. ఫోన్‌లో ఫారెస్టు అధికారులతో మాట్లాడారు. పాత రోడ్డును వదిలి రోడ్డుకు ఇరువైపుల గోడ ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
రేవంత్ పాలన బాగుంటే రాజకీయాలే వద్దు
రేవంత్ రెడ్డి పాలన బాగుందని ప్రజలు అంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ చేశారు. సీఎం మంచి పని చేస్తున్నారని ప్రజలు మెచ్చుకుంటే ముక్కు నేలకు కూడా రాస్తానన్నారు. హరీశ్ రావు ఏదో రాసిస్తే తాను మాట్లాడుతానని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలాంటి భద్రత లేకుండా మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళదామా? అని నిలదీశారు. నీకు దమ్ముంటే నేను మీరు ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో కూలగొట్టబోతున్న ఇళ్ళ దగ్గరికి పోదామా?ఒక రోజు రెండు రోజుల డేట్ పెట్టండని ఛాలెంజ్ చేశారు. చట్టం సిస్టం లేని అరాచక శక్తివి నీవని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com