BJP: నేడు 11 రాష్ట్రాల పదాధికారులతో నడ్డా మీటింగ్..

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీ దూకుడు పెంచుతోంది.వరంగల్ వేదికగా ప్రధాని మోదీతో భారీ బహిరంగ సభ నిర్వహించిన కమలం పార్టీ.. అదే జోష్ కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఇవాళ హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మరో కీలక సమావేశం నిర్వహిస్తోంది. 11 రాష్ట్రాల పదాధికారులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నారు.నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి.. సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరగనుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలే టార్గెట్‌గా బీజేపీ ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ భేటీలో వ్యూహాలను సిద్ధం చేయనున్నారు. ఇందులో భాగంగానే నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కొత్త ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు హైకమాండ్ నియమించింది.
సమావేశంలో తెలంగాణ బీజేపీ నుంచి ప్రకాశ్ జవడేకర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు ముఖ్య నేతలు పాల్గొననున్నారు. భేటీలో తాజా రాజకీయాలతో పాటు వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేసిన కమలం పార్టీ.. జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. మరోవైపు ప్రజా సమస్యలపై బీజేపీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. 2012లో కిషన్ రెడ్డి చేపట్టిన పోరు యాత్రలో తరహాలోనే మరో ప్రోగ్రాం డిజైన్ చేసేందుకు సిద్ధమౌతోంది బీజేపీ.
ఇక బీజేపీ రీజినల్ కన్సల్టెటివ్ మీటింగ్ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిషేదాజ్ఞలు విధించారు. పార్టీ కార్యాలయంలోకి ఆహ్వానం లేని నాయకులను, ఇతరులను అనుమతించడం లేదంటూ ప్రకటన రిలీజ్ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అనుమతించడం లేదని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com