TG : మూసీ మహా ధర్నాకు బీజేపీ ప్లాన్

X
By - Manikanta |22 Oct 2024 6:00 PM IST
నగరంలోని మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతలపై బాధితులతో కలిసి మహా ధర్నాకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ నెల 25న ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన బాధితులతో మహాధర్నా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 23 , 24 తేదీల్లో మూసీ బాధిత పరివాహక ప్రాంతాల్లో వారు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బీజేపీ 9 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు పర్యటనలో బాధితులకు భరోసా కల్పించనున్నారు. ఈ విషయాలను బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు సోమవారం పార్టీ స్టేట్ ఆఫీస్‌లో మీడియాకు వెల్లడించారు.18 ప్లేస్‌లలో ఎంపీ, ఎమెల్యేల బృందాలు మూసీ పరివాహక ప్రాంతాను విజిట్ చేస్తాయని ప్రకటించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com