Bomb Threat : సెక్రటేరియట్ కు బాంబు బెదిరింపులు.. పోలీసుల అదుపులో నిందితుడు

తెలంగాణ సెక్రటేరియట్ కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. సెక్రటేరియట్ ను బాంబు పెట్టి పేల్చి వేస్తామని బెదిరింపు కాల్ చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సచివాలయాన్ని పేల్చేస్తాని సీఎంపీఆర్ఓ ఆఫీస్ కు ఓ వ్యక్తి కాల్ చేసి బెదిరించినట్టు గా సమాచారం. నిందితుడిని గుర్తించి ఎస్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కాల్ చేసిన వ్యక్తి తనకు ఆఫీస్ లో ఏదో పని ఉండడంతో బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు సమాచారం. సదరు వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని మరో వాదన వినిపిస్తోంది. సచివాలయంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు ఎలాంటి బాంబు లేదని పోలీసులు తేల్చారు. బెదిరింపులకు పాలప్పడిన వ్యక్తి లంగర్ హౌస్ కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీగా గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com