Breaking : గవర్నర్ ఆమోదం తర్వాత ఫార్ములా ఈ రేసు కేసులో తొలి అరెస్ట్

Breaking : గవర్నర్ ఆమోదం తర్వాత ఫార్ములా ఈ రేసు కేసులో తొలి అరెస్ట్
X

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో అవినీతికి సంబంధించి సంచలనం నమోదు కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం గవర్నర్ కు ఈ కేసు వివరాలు తెలియజేసింది. మాజీ మంత్రి స్థాయి నాయకులను అరెస్ట్ చేసినప్పుడు గవర్నర్ అనుమతి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ (PC) యాక్ట్ లో గవర్నర్ అనుమతి తప్పని సరి అని చట్టం చెబుతోంది. మాజీ మంత్రుల ప్రమేయం ఉన్న నేపథ్యంలో గవర్నర్ అనుమతి తీసుకోవాలని.. ప్రజా ప్రాతినిధ్యం చట్టం సెక్షన్ 17-A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలని చట్టం చెబుతోంది. ప్రభుత్వం రాసిన లేఖను గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు 4 నెలల వరకు అత్యధిక గడువుతీసుకోవచ్చు. ఐతే.. అంత సమయం తీసుకోరని వెంటనే ప్రభుత్వానికి సానుకూలత తెలుపుతారని చెబుతున్నారు. గవర్నర్ నిర్ణయం వచ్చిన తర్వాత కేసులో కీలక వ్యక్తులపై ఏసీబీ కేసు నమోదు చేస్తుంది. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ లాంటి కీలక చర్యలు తీసుకుంటారు.

Tags

Next Story