CP CV Anand : ప్రతి స్కూల్ దగ్గర బ్రీత్ ఎనలైజర్ ఉండాలి : సీపీ సీవీ ఆనంద్

CP CV Anand : ప్రతి స్కూల్ దగ్గర బ్రీత్ ఎనలైజర్ ఉండాలి : సీపీ సీవీ ఆనంద్
X

ఇంటి నుంచి స్కూల్వెళ్లే ప్రతి విద్యార్థి భద్రత.. అందరి బాధ్యతని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. నిన్న రవీంద్రభారతిలో విద్యార్థుల భద్రతకు సంబంధించి పాఠశాలల యాజమాన్యాలతో ట్రాఫిక్ పోలీసులు నిర్వ హించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ హరిచందనతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కూల్ యాజమాన్యం రవాణా వ్యవస్థపై పట్టి ష్ట చర్యలు తీసుకోవాలన్నారు. 'ప్రతి పాఠశాల లో బస్సుల యొక్క సేఫ్టీ మెజర్స్ పాటించాలి. డ్రంకన్ డ్రైవ్ లో స్కూల్ బస్సు డ్రైవర్ పట్టుబడి తే కఠిన చర్యలు తీసుకుంటాం. బ్రీత్ ఎనలైజర్ పరికరాలను స్కూల్ మేనేజ్ మెంట్ దగ్గర ఉంచుకోవాలి. బస్సు డ్రైవర్ల పరిస్థితిని బట్టి అవసరమైతే వారికి బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేయాలి. స్కూల్స్ దగ్గర వైన్ షాపులు ఉంటే సమాచారం ఇవ్వండి. పాఠశాలల దగ్గర పాన్ షాప్ ల్లో మాదకద్రవ్యాలు అమ్ముతున్నట్లు సమాచారం వచ్చింది.. అలాంటి దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని సీవీ ఆనంద్ హెచ్చరించారు.

Tags

Next Story