Bridge India : కేటీఆర్ కు బ్రిడ్జ్ ఇండియా ఆహ్వానం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు మరో ప్రతిష్టాత్మక సదస్సుకు ఆహ్వానం అందింది. బ్రిటన్లో జరిగే 'ఐడియాస్ ఫర్ ఇండియా' సదస్సుకి రావాలంటూ బ్రిడ్జ్ ఇండియా సంస్థ ప్రత్యేకం గా కేటీఆర్ ను ఆహ్వానించింది. మే 30 లండన్లోని రాయల్ లాంకాస్టర్ హోటల్లో జరిగే సదస్సుకు కేటీఆర్ ను ముఖ్య వక్తగా పిలుస్తూ, బ్రిడ్జ్ ఇండియా వ్యవస్థాపకుడు ప్రతీక్ దత్తానీ ఆహ్వాన లేఖ పంపారు. 2023లో ఇదే కార్య క్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న కేటీఆర్ ప్రసంగం, ఆలోచనలు అందరినీ ఆకట్టుకున్నాయని ప్రతీక్ తెలిపారు. 'ఐడియాస్ ఫర్ ఇండియా' సదస్సుకి భారత్ బ్రిటన్ వ్యాపార రంగ ప్రముఖులు, పాలసీ మేకర్లు, తెలుగు ప్రవాసులు సహా 900 మందికి పైగా ప్రము ఖులు హాజరవుతారు. ఈ వేదికలో భారత ఆర్థిక ప్రగతి, విదేశీ పెట్టుబడుల అవకాశా లు, వాణిజ్య సంబంధాల పురోగతి వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు జరుగుతా యి. కేటీఆర్ తన పర్యటనలో బ్రిటన్ పారిశ్రా మికవేత్తలు, తెలుగు ప్రవాసులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com