Revanth Reddy :స్కాలర్షిప్ కు బ్రిటన్ ఓకే

తెలంగాణ విద్యార్థులకు చెవెనింగ్ స్కాలర్షిప్ కు యూకే అంగీకరిం చింది. ఈ మేరకు భారత బ్రిటీష్ హై కమిషన ర్ లిండీ కామెరాన్ సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. ఇవాళ జూబ్లీహిల్స్లోని నివాసంలో భారత బ్రిటీష్ హై కమిషనర్తో సీఎం భేటీ అయ్యారు. యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ఈ స్కాలర్షిప్స్ కో-ఫండింగ్ ప్రాతి పదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు ఇవ్వా లని కోరారు. రాష్ట్రంలో తీసుకు రాబోతున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీ డ్రాప్ట్ను సీఎం రేవంత్ .. బ్రిటీష్ హై కమిషనర్కు ఈ సందర్భంగా వివరించారు. యూకేలోని యూనివర్సిటీల్లో చదిచే రాష్ట్ర విద్యార్థుల సౌకర్యం కోసం హైదరాబాద్ నుంచి అక్కడి యూనివర్సిటీలు ఆపరేట్ చేసేలా చూడాలని కోరారు. విద్యా, సాంకేతిక సంబంధిత రంగాల్లో సహకారం అందించేం దుకు తాము సిద్ధంగా ఉన్నట్లు లిండీ కామెరాన్ సీఎంకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అదే విధంగా మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటీష్ కంపెనీలు భాగ స్వాములు కావాలని, జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్ అకాడమీ విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం రేవంత్రెడ్డి కోరగా.. బ్రిటీష్ హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com