Rakhi : తండ్రి భుజం ఎక్కి.. అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు

Rakhi : తండ్రి భుజం ఎక్కి.. అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు
X

రక్షా బంధన్.. సోదరీ, సోదరుల మధ్య అంతులేని ప్రేమను సూచించే వేడుక. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అన్నాదమ్ముళ్లు ఎక్కడున్నా అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. అయితే ఎంతో సంతోషంగా అక్కలతో రాఖీ కట్టించుకుందామని వచ్చిన తమ్ముడికి నిరాశే ఎదురైంది. కానీ తండ్రికి వచ్చిన ఆలోచనతో రాఖీలు కట్టించుకునే వెళ్లాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. దాసరి అశ్విక, సహస్ర అనే ఇద్దరు అక్కచెల్లెళ్లు రామక్రిష్ణాపూర్ గురుకుల పాఠశాలలో‌ చదువుతున్నారు. అక్కలిద్దరూ రాఖీ పండుగకు ఇంటికి రాకపోవడంతో.. స్వీట్లు, రాఖీలు తీసుకుని తండ్రితో కలిసి తమ్ముడు జితేంద్ర హాస్టల్‌ దగ్గరికి వెళ్లాడు. కానీ అతడిని స్కూల్ లోప‌లికి అనుమ‌తించ‌లేదు. దీంతో బయట జితేంద్ర, లోపల అక్కలిద్దరూ ఏడ్వడం మొదలెట్టారు. ఇంతలోనే తండ్రి కొడుకును భుజాలపై ఎత్తుకోగా.. అక్కలు తమ్ముడికి రాఖీ కట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Tags

Next Story