TG : బీఆర్ఎసోళ్లకు చెంప చెళ్లుమంది : ఆది శ్రీనివాస్

TG : బీఆర్ఎసోళ్లకు చెంప చెళ్లుమంది : ఆది శ్రీనివాస్
X

ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెంప చెళ్లు మనిపించేలా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. భవిష్యత్తులో ఆ పార్టీ ఖాళీ కావడం ఖాయమని.. ఐదారుగురు తప్ప మిగిలిన ఎమ్మెల్యే లు గులాబీ పార్టీలో ఉండరని తెలిపారు. ఇవాళ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 'హైకో ర్టులో బీఆర్ఎస్ భంగపడింది. ఎమ్మెల్యేల అనర్హ తపై సర్వాధికారాలు స్పీకర్కు ఉన్నాయని కోర్టు తేల్చింది. నిర్ణీత సమయాన్ని కూడా న్యాయస్థానం ప్రస్తావించలేదు. అన్ని విషయాలు తెలిసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లి దెబ్బతిన్నారు. రాజ్యాంగం ప్రకారం సభాపతి నడుచుకుంటా రు. కోర్టు తీర్పు రాకుండానే గతంలో కేటీఆర్ ఈ విషయంలో ఎగిరెగిరి పడ్డారు. అప్పుడే ఉప ఎన్నికలు వచ్చినట్లుగా హడావిడి చేశాడు. చేసిన పాపం గోచిలో పెట్టుకొని కాశీకి పో యినట్లు కేటీఆర్, బీ ఆర్ఎస్ నేతల తీరు ఉంది. పదేండ్లపాటు రాజ్యాం గాన్ని అపహస్యం చేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే లను క్యాబినెట్లో చేర్చుకొని నైతిక విలువలను తీ సుకెళ్లి కాళేశ్వరంలో కలిపారు. పార్టీలకు పార్టీల ను విలీనం చేసుకుని రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎంత గగ్గోలు పెట్టినా కేసీఆర్ లె క్కచేయలేదు. తెలంగాణ పునర్ నిర్మాణం కోసం ఫి రాయింపులు చేసుకోవచ్చునని నిర్లజ్జగా చెప్పుకొని తిరిగారు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్కు రాజ్యాంగం, న్యాయస్థానాలు గుర్తుకు వచ్చాయి. కేసీఆర్ ఫామ్ హౌస్కు, కేటీఆర్ గెస హౌసు, హరీశ్రవు నార్సింగిహౌస్కు పరిమితం కావా ల్సిందే' అని ఆది ఎద్దేవా చేశారు.

Tags

Next Story