BRS : పోయిన చోటే వెతుక్కుంటున్న బీఆర్ ఎస్..

బీఆర్ ఎస్ పార్టీ నేతలు పోయిన చోటే మళ్లీ గెలిచి నిలబడాలని చూస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. పార్లమెంట్ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ ఎస్.. ఇప్పుడు మున్సిపాలిటీల్లో బలమైన సీట్లు సాధించి తమ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు అన్ని చైర్మన్ స్థానాలను బీఆర్ ఎస్ దక్కించుకుంది. ఈ సారి అంత కాకపోయినా.. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా.. బలమైన సీట్లు సాధించి తమ పట్టు పెరిగిందని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు బీఆర్ ఎస్ నేతలు. ఇందులో భాగంగా కేటీఆర్, హరీష్ రావు ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నారు. కాంగ్రెస్, బీజేపీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు కేటీఆర్, హరీష్ రావు. రాబోయే రెండున్నరేళ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వమే వస్తుందని.. కాబట్టి అభ్యర్థులు పార్టీలు మారి ఇబ్బంది పడొద్దని కోరుతున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ నేతలను గెలిపిస్తే.. రాబోయే రెండున్నరేళ్లలో తమ ప్రభుత్వం వచ్చాక అద్భుతంగా డెవలప్ చేస్తామని హామీలు ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా మున్సిపాలిటీలను పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతోందని.. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు కేటీఆర్.
ఈ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేటీఆర్, హరీష్ రావు స్పీచ్ లతో హైలెట్ కావాలని చూస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఎలాగూ ఎన్నికలకు దూరంగానే ఉంటున్నారు. కాబట్టి వీరిద్దరిపైనే బరువు, బాధ్యతలు ఉంటున్నాయి. మరి వీరిద్దరి ప్రచారాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
Tags
- BRS Party
- Telangana Municipal Elections
- KTR Campaign
- Harish Rao Speeches
- BRS Comeback Strategy
- Telangana Politics
- Municipal Polls Telangana
- Congress vs BRS
- BJP vs BRS
- Revanth Reddy Targeted
- KCR Absent from Campaign
- BRS Strong Seats
- Opposition Politics Telangana
- Local Body Elections
- Telangana Political Heat
- BRS Grassroots Strategy
- Telangana News
- Telangana Polities
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
