TG : కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసనగా బీఆర్‌ఎస్‌ నేతలు

TG : కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసనగా బీఆర్‌ఎస్‌ నేతలు
X

కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ నేతలపై అక్రమ కేసులు పెట్టడానికి నిరసనగా బీఆర్‌ఎస్‌ పార్టీ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలను వారి ఇళ్ల వద్దే హౌస్‌ అరెస్టులు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవితను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఇళ్లు, స్టేషన్ల నుంచి నేతలు బయటకు రాకుండా నిర్బంధం విధించారు. నార్సింగిలో హరీశ్ రావును, కుత్బుల్లాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Tags

Next Story