Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ చీకటి ఒప్పందం : కిషన్ రెడ్డి

ఇప్పటివరకు డీలిమిటేషన్ పై ఉన్న చట్టాలు చేసింది కాంగ్రెస్సే అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం సరికాదన్నారు. బీ ఆర్ఎస్, కాంగ్రెస్ జతకట్టిపోవడం వాళ్ల చీకటి, ఒప్పందానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. 'డీలిమిటేషన్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్లు పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. చెన్నైలో జరిగిన డీలిమి టేషన్ సమావేశంలో రెండు పార్టీల నిజస్వరూపం.. వారి మధ్య ఉన్న పాతబంధం మరోసారి బయటపడింది. ఏదో జరిగిపోతుందని కేటీఆర్, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సీఎం ఆరు గ్యారెంటీలపైన దృష్టి పెడితే బాగుంటుంది. గతంలో ఇవే రాజకీయ పార్టీలు రాజ్యాంగం మారుస్తారని ప్రచారం చేశారు. ఏది జరిగిన ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు. అవినీతి, కుటుంబ పార్టీలు చేస్తున్న వాటిని ప్రజలు తిప్పి కొట్టాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సయోధ్యని కుదుర్చే పనిలో ఎంఐఎం ఉంది. డీ లిమిటేష న్ పై సమావేశం హైదరాబాద్ లో కాకుంటే కొడంగల్ లో పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు ’అని అన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీకే పట్టం 'నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంట్ లో కానీ ఎక్కడ చర్చనే జరగలేదు. కేంద్ర ప్రభు త్వం దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అవకాశ వాద పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తు న్నాయి. డీఎంకే తమిళనాడు సీఎం నాలుగు ఏళ్ల నుంచి అవినీతి పాలన చేస్తున్నాడు. ప్రజ ల్లో వ్యతిరేకత రావడంతో డీలిమిటేషన్ పేరుతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రజలు మా వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. అ రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రజలు బీజేపీకి పట్టం కడతారు' అని కిషన్రెడ్డి అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com