BRS Demands : 30 పర్సెంట్ పాలన వద్దంటూ బీఆర్ఎస్ డిమాండ్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసనకు దిగారు. వద్దురా నాయనా.. థర్టీ పర్సెంట్ పాలన అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ లాబీలో నినాదాలు చేసుకుంటూ బయటకు వచ్చారు. అంతకు ముందు అసెంబ్లీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు చేపట్టిన పనుల్లో 30శాతం కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. తాము 30 శాతం కమిషన్లు తీసుకున్నట్లుగా నిరూపించాలని డిప్యూటీ సీఎం భట్టి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించి అడ్డగోలుగా దోచుకున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భట్టి వ్యాఖ్యలపై కేటీఆర్, బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని స్పీకర్‌ను కోరగా ఆయన నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనకు దిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com