Mynampally Rohith : బీఆర్ఎస్ పని ఖేల్ ఖతం..దుకాణం బంద్ - మైనంపల్లి

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ‘‘ఖేల్ ఖతం..దుకాణం బంద్’’ అయిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. వారు తట్టా బుట్టా సర్దుకోవాల్సిన టైమ్ వచ్చిందన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ మానసిక స్థితి సరిగ్గా లేదని రోహిత్ ఆరోపించారు. కుటుంబంలోని గొడవలతోనే వారు సతమతమవుతున్నారని.. ఇంకా ప్రజల గురించి ఏం పట్టించుకుంటారని విమర్శించారు. ఆ బాధతోనే కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు రావడం లేదన్నారు. గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకోవడం, దాచుకోవడం తప్ప బీఆర్ఎస్ ప్రజల గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ బహిష్కరించిన నాయకులను బీఆర్ఎస్ చేర్చుకుని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని రోహిత్ విమర్శించారు. కాగా ఇటీవల మెదక్ నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలోకి చేరారు. ఈ క్రమంలోనే మైనంపల్లి హనుమంత రావు, రోహిత్ బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. హనుమంతరావు కూడా కేసీఆర్ ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com