CM Revanth Reddy : పెట్టుబడులపై బీఆర్ఎస్ నేతలది ఓర్వలేని తనం.. సీఎం కౌంటర్

CM Revanth Reddy : పెట్టుబడులపై బీఆర్ఎస్ నేతలది ఓర్వలేని తనం.. సీఎం కౌంటర్
X

విదేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడులు తెస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. లక్షా 80 వేల కోట్ల రూపాయలు పెట్టడానికి పలు కంపెనీలు దావోస్‌లో ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. సింగపూర్ ఐటీతో తెలంగాణ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి ఒప్పందం చేసుకుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలలో.. ఇదే అతి పెద్ద విజయం అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కొందరు తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీయడానికి, దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ, ఇప్పుడు అవన్నీ పటాపంచలు అయ్యాయన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రభుత్వంపైన ప్రపంచ స్థాయి కంపెనీలు చూపిస్తున్న విశ్వాసం అలాంటిదన్నారు.

Tags

Next Story