Kaushik Reddy : చీరలు, గాజులు, చెప్పుల లొల్లి.. మొదలైంది ఇక్కడే!

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. పార్టీ ఫిరాయింపులు, హైకోర్టు ఆదేశాలు, అసెంబ్లీ కమిటీల నియామకం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించాయి. ఆరెకపూడి గాంధీ సహా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పార్టీ మారినా రాజీనామాలు చేయని నేతలు, పదవులు అనుభవిస్తున్న నేతలకు చీర, గాజులు పంపుతానంటూ వ్యాఖ్యలు చేశారు హుజురాబాద్ ఎమ్మెల్యే. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడాలని సవాల్ చేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపుతున్నానంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేతలు భగ్గుమన్నారు. మహిళలను కించపరిచేలా మరోసారి మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, మహిళ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి .. కౌశిక్ రెడ్డికి ప్రెస్ మీట్ లోనే చెప్పు చూపించి హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com