TG : నన్ను చంపించే కుట్ర..- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు

ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి- అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం గాంధీకి ఇంటికి వెళ్లి గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గురువారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అటు అరికెపూడి గాంధీ ఇంటి వద్ద సైతం పోలీసు బందోబస్తు పెంచారు. బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్‌లు సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితలు తలెత్తాయి. మరోవైపు హరీశ్ రావు ఇంటికి వెళ్లేందుకు సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయా నేతలు అక్కడికక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. శ్రీనగర్ కాలనీలో సబితా ఇంద్రారెడ్డి, వెస్ట్ మారేడుపల్లిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానందను హౌస్ అరెస్ట్ చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే గాంధీ ఇంటికి బయల్దేరిన కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. బాచుపల్లిలోని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి నుంచి వివేకానంద నగర్‌లోని గాంధీ ఇంటికి బయలు దేరిన కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బలవంతంగా కౌశిక్ రెడ్డి, శంభీపూర్ రాజును పోలీసులు ఇంట్లోకి పంపించారు. గాంధీ ఇంటికి వెళ్లడానికి అనుమతి లేదంటూ చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత మారింది. .
అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్ నేతలు ఆగమాగమవుతున్నరు : రాజాసింగ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ఫైరయ్యారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్ నేతలు గందరగోళానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు. పని పాట లేక కేంద్రంపై కేటీఆర్ ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన రాజాసింగ్.. బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో కేటీఆర్ ఆందోళనలో ఉన్నారన్నారని.. అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. హిందీ కూడా నేర్చుకుంటే బాగుంటుందని ప్రజలకు ఒక సూచన చేశారు. దాన్ని తప్పు పడుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పనేమీ లేకపోవడంతో కేంద్రంపై కేటీఆర్ ఏదో ఒక ఆరోపణ చేయాలని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేతలు మంచి ఫైట్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పాటుగా కేటీఆర్ కూడా పోరాడాలి. కానీ, ఎక్కడో ఉండి ఇలా ట్వీట్ చేయడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా మధ్యలో వచ్చి మంచి పనులపై ఇలాంటి కామెంట్స్ చేస్తే జనాలు మిమ్మల్ని పిచ్చి వాళ్లు అనుకుంటారు’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com