BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఘర్ వాపసీ?

గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు మళ్లీ ఇంటి దారి పట్టినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఘర్‌వాపసీ వ్యూహం అమలు చేస్తున్నది. కాంగ్రెస్ లో చేరిన తమ ఎమ్మెల్యేలను తిరిగి వెనక్కి తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మధ్య కాంగ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు త్వరలోనే గులాబీ గూటికి వస్తారని బీఆర్ఎస్ పెద్దలు చెబుతున్నారు. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి.. తాను బీర్ఎస్‌లోకి వచ్చినట్టు ప్రకటించగా.. మరో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కేటీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. వీరు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని ఎలాగైనా తిరిగి సొంతగూటికి తీసుకురావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ఘర్‌వాపసీ ఆపరేషన్ ప్రారంభించింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఇప్పటికే తాను బీఆర్ఎస్‌లో చేరినట్టు ప్రకటించారు. ఇక భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రశాంత్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే ఆయన మళ్లీ బీఆర్ఎస్‌లోకి తిరిగి రాబోతున్నట్టు తెలుస్తున్నది. వీరితోపాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలు కూడా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని బీఆర్ఎస్ పెద్దలు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com